
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14, ప్రభాతవార్త: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాలని విశ్వప్రయత్నాలు చేసిన స్థానిక ఏసీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన ఆయన… శాంతిభద్రతల పేరుతో తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు.
Read Also: BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?
రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశం
అకారణ నిర్బంధాలు, కేసుల బెదిరింపులు, ప్రచారానికి అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థను ప్రభావితం చేశారనే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని వినియోగించారని విమర్శించారు.అయితే ఇలాంటి చర్యలు ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాయని, చివరకు ప్రజలే తగిన తీర్పు ఇచ్చారని ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: