కోలీవుడ్లో మరోసారి వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు ధనుష్ (Dhanush Controversy) తాజా న్యాయపరమైన సమస్యలతో వార్తల్లో నిలిచారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ తో ఆయనకు ఏర్పడిన వివాదం రోజురోజుకు ముదురుతున్నట్లు తెలుస్తోంది. 2016లో ‘నాన్ రుద్రన్’ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కమిట్మెంట్ పూర్తి చేయలేదని, స్క్రిప్ట్ ఇవ్వలేదని సంస్థ ఆరోపిస్తోంది. షూటింగ్ ఆలస్యమవడంతో రూ.20 కోట్లు నష్టం జరిగిందని లీగల్ నోటీసులు పంపింది. ప్రస్తుతం ధనుష్ మరో సినిమాలో నటిస్తుండగా, ఈ వ్యవహారంపై ఆయన బృందం ఇంకా స్పందించలేదు.
Read Also: Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత

ధనుష్ ప్రస్తుత సినిమాలు..
ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డీ55 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీల తో పాటు ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే చివరిగా తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ గా వచ్చిన కుబేర సినిమా చేసి మంచి విజయాన్నిఅందుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా.. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కారా లో ధనుష్ నటిస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.అలాగే దర్శకుడు వెట్రిమారన్ తో ఒక సినిమా చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: