Ind vs Pak colombo : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు కొలంబోకు చేరుకుంది. ఆదివారం శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ హై-వోల్టేజ్ పోరు కోసం ఆటగాళ్లు శుక్రవారం ఢిల్లీ నుంచి బయల్దేరి శ్రీలంకకు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
గ్రూప్ ‘ఏ’లో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచే అవకాశముంది. భారత్ అమెరికా, నమీబియాలపై ఘన విజయాలు సాధించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్, అమెరికాను ఓడించి మంచి ఫామ్‌లో ఉంది.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత

మ్యాచ్ నిర్వహణపై గతంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఐసీసీ చర్చలు మరియు శ్రీలంక ప్రభుత్వ విజ్ఞప్తి తర్వాత పాకిస్థాన్ తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో దాయాదుల మధ్య మరో ఉత్కంఠభరిత పోరుకు మార్గం సుగమమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: