DK Shivakumar news : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రాజకీయ చర్చల మధ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ నమ్మకంతోనే జీవిస్తానని, కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని అన్నారు. “శ్రమ ఉన్న చోట ఫలితం ఉంటుంది… భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు” అంటూ ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కార్యక్రమం అనంతరం, అలాగే టిప్టూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీ పర్యటన తర్వాత మీలో విశ్వాసం పెరిగిందా అన్న ప్రశ్నకు ఇదే సమాధానాన్ని పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి 17న సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఢిల్లీకి పిలిచారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “అది నాకు తెలియదు… కాలమే సమాధానం చెబుతుంది” అని అన్నారు.
Read Also: Thailand: డే కేర్ స్కూల్‌లో కాల్పులు

కొంతమంది ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్తున్నారన్న వార్తలపై తాను ఎలాంటి నివేదిక కోరలేదని స్పష్టం చేశారు. తాను పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడినని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే హైకమాండ్, ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని అన్నారు.
ఇదిలా ఉండగా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన మద్దతుదారు ఎమ్మెల్సీ చెన్నరాజ్ హట్టిహోళి వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సీఎం పదవిపై చర్చ మరింత వేడెక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: