Ibrahimpatnam municipal elections: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులలో 13 వార్డులను గెలిపించి బిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అందించిన పట్టణ ప్రజలకు పార్టీ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మరోసారి బిఆర్ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ మద్దతును ఓట్ల రూపంలో వ్యక్తం చేశారని అన్నారు.
Read also: Municipal Election Results: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం
గెలిచిన కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam municipal elections) అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, శుభ్రత, తాగునీరు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని దండెం రాంరెడ్డి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: