
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలోని వైరల్ అయిన హుక్ స్టెప్ ను తాను కంపోజ్ చేయలేదని, రామ్ చరణ్ స్వయంగా కంపోజ్ చేశారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెల్లడించారు. ”చికిరి పాటలో హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది చరణ్ అన్న కంపోజ్ చేశారు.. నేను కాదు. బ్యాట్ పట్టుకొని చేసే డాన్స్ చరణ్ స్వయంగా కంపోజ్ చేశాడు. కూర్చొని రెండు చేతులు పైకి ఎత్తి చేసే స్టెప్ నేను చేశాను. ఆ బ్యాట్ స్టెప్ ఐడియా చరణ్ దే. ఇలా చేద్దామని డ్యాన్స్ చేసి చూపించింది కూడా ఆయనే.
Read Also: Actress: పూజిత పొన్నాడ లేటెస్ట్ లుక్ వైరల్
2026 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల
వెనక వెనక పడతా అని వచ్చినప్పుడు బ్యాట్ కదిపితే బాగుంటుందని నేను చెప్పాను” అని జానీ అన్నాడు. దీంతో అక్కడున్న నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్ తో సహా అందరూ షాక్ అయ్యారు.రామ్ చరణ్ చేసినా బయటకు మాత్రం చెప్పరని, క్రెడిట్ మాత్రం తనకు ఇచ్చారని జానీ మాస్టర్ అన్నాడు. ”ఏ రోజూ చరణ్ అన్న చెప్పడు. ఆ క్రెడిట్ నాకే ఇచ్చేసాడు.
ఎందుకంటే, ఐడియా తనదే అయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి, అది క్లిక్ అవుతుందని నమ్మావు కాబట్టి ఈ క్రెడిట్ నీకే ఇచ్చేస్తున్నా అన్నారు” అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ దివ్యేన్దు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: