ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in ద్వారా లేదా మన మిత్ర వాట్సాప్ సేవ (9552300009) ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు వెంటనే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. ఫీజు బకాయిల పేరుతో హాల్టికెట్లు ఇవ్వకుండా నిరాకరించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read Also: AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో మార్పులు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వివరాలు
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. అన్ని జిల్లాల్లో ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు హాల్టికెట్లో పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, తేదీలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. తప్పులుంటే వెంటనే కాలేజ్ యాజమాన్యం లేదా బోర్డు అధికారులకు తెలియజేయాలని తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచనలు
- హాల్టికెట్ తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి
- గుర్తింపు కార్డు (ID) వెంట తీసుకెళ్లాలి
- పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి
- నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదు
- ప్రశాంతంగా పరీక్ష రాయాలని అధికారులు సూచించారు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: