పోటెత్తిన భక్తజన సందోహం… పోలీసుల పటిష్ట భద్రత
చంద్రగిరి : ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవింద అంటూ భక్తజనుల గోవింద నామస్మరణల నడుమ శ్రీనివాసుడి నిత్య వాహనమైన గరుడ వాహన సేవ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. (Tirumala) శ్రీనివాస మంగాపురంలో వెలసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి (Sri Kalyana Venkateswara Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తిని మండపానికి వేంచేపు చేశారు. శ్రీనివాసుడి బ్రహ్మో త్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవలో స్వామివారిని వీక్షించడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
Read Also: Vijayawada: నేటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు

(Tirumala) శ్రీవారి నిత్యవాహనమైన గరుడుడిని వాహనం గా చేసుకుని శ్రీనివాసుడు తిరుమాడవీధులలో విహరిస్తుండగా దర్శించుకోవడం ద్వారా సకల పాపహరణ, మోక్షప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ యం.గోపినాధ్, సూపరింటెండెంట్స్ వల్లంశెట్టి రమేష్‌బాబు, రాజ్‌కుమార్, టెంపుల ఇన్స్పెక్టర్ డి. మునికుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ అనుంబట్టు ధనశేఖర్, ఆలయ కంకణ భట్టార్ బాలాజీ రంగకుమార్, ప్రధాన అర్చకులు పార్థసారథి నారాయణాచార్యులు పాల్గొన్నారు.
మోహినీ అవతారంలో కళ్యాణ వెంకన్న
శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో పల్లకిపై విహరించగా, తిరుచ్చిపై చిన్నికృష్ణుడి అలంకరణలో ఊరేగుతూ భక్తు లకు దర్శనమిచ్చారు. మోహినీ అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మోహాలు తొలగి సర్వం శ్రీహరి మయం కాగలదని పురాణాలు తెలియజేస్తున్నాయి.
వైభవంగా ఆండాళ్ అమ్మవారి మాలలు ఊరేగింపు
కళ్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్స వాలను పురస్కరించుకుని గురువారం తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా అశేష భక్తులతో ప్రారంభమైన గోదా కళ్యాణయాత్ర అంబారీపై మాలలను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపించి అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజియ్యర్ స్వామి, చిన్న జియ్యర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా శోభాయాత్ర
కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలను పురస్క రించుకుని సంప్రదాయానుసారం లక్ష్మీకాసుల హారం టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులకు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: