మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాజధాని బెంగళూరులో మాంసం విక్రయాలపై కీలక నిర్ణయం వెలువడింది. భక్తుల మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 15వ తేదీ (ఆదివారం) బెంగళూరు నగరవ్యాప్తంగా జంతు వధ మరియు మాంసం విక్రయాలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ పూర్తిగా నిషేధించింది. అథారిటీ పరిధిలోని అన్ని చికెన్, మటన్, చేపల దుకాణాలతో పాటు కబేళాలను (Slaughterhouses) ఆ రోజు 24 గంటల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. శివరాత్రి రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం మరియు జాగరణలు నిర్వహిస్తారని, వారి సెంటిమెంట్లను గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
AP : మా ప్రాజెక్టుల్ని ఏపీ ఎందుకు అడ్డుకుంటోంది ? – సీఎం రేవంత్
ఈ నిషేధం కేవలం ప్రత్యక్ష విక్రయాలకే కాకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మాంసాహారాన్ని వడ్డించకూడదని, అలాగే డెలివరీ యాప్స్ ద్వారా మాంసం పంపిణీ చేయకూడదని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి రహస్యంగా విక్రయాలు జరిపినా లేదా జంతు వధ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎనిమల్ హస్బెండరీ విభాగం హెచ్చరించింది. నగరంలోని అన్ని ప్రధాన మార్కెట్లు మరియు లైసెన్స్ కలిగిన దుకాణాలకు ఇప్పటికే సర్క్యులర్లు అందజేశారు.

బెంగళూరులో మహాశివరాత్రి, గాంధీ జయంతి, సర్వోదయ దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో మాంసం అమ్మకాలను నిషేధించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈసారి శివరాత్రి ఆదివారం రావడంతో మాంసప్రియులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, మతపరమైన సామరస్యం మరియు సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. భక్తులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, వ్యాపారులు ఒకరోజు ముందుగానే స్టాక్ సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com