ఆంధ్రప్రదేశ్‌లో (Chittoor) మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బైవీక్లీ సర్కిల్ వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టి లారీ కిందే ఇరుక్కుపోయింది. దీంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కారులో ఉన్న ఆరుగురు లోపలే ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాహనాన్ని తెరిచి మృతదేహాలను బయటకు తీశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు (Chittoor) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: