Couple friendly movie : యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందురోజు ఫిబ్రవరి 13న తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని AAA సినిమాస్, విశాఖలో మెలోడీ థియేటర్, విజయవాడ శైలజ థియేటర్, గుంటూరు భాస్కర్ థియేటర్లలో రాత్రి 7 గంటలకు ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. నెల్లూరు M1 సినిమాస్‌లో రాత్రి 9 గంటలకు, తిరుపతి PGR థియేటర్లో సాయంత్రం 6:45 గంటలకు ప్రత్యేక షోలు ప్రారంభమవుతాయి.
Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో సంతోష్ శోభన్ ఇంటీరియర్ డిజైనర్‌గా, మానస వారణాసి ఐటీ ప్రొఫెషనల్‌గా నటించారు. బైక్ పూలింగ్ ద్వారా పరిచయం అయిన ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పెరిగిందనే కథాంశంతో సినిమా సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రానికి అదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు. ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: