Telangana vote counting : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
పోలింగ్ రోజు ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల వరకు 11.6%, 11 గంటలకు 28.48%, మధ్యాహ్నం 1 గంటకు 48.54%, మధ్యాహ్నం 3 గంటలకు 62.09% ఓటింగ్ నమోదై, చివరికి 73.01% వద్ద ముగిసింది.
Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

ఈ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పార్టీ గుర్తుల ఆధారంగా నిర్వహించబడ్డాయి. ఓటర్ల జాబితా నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్ల కోసం 29,656 మంది బూత్ లెవల్ అధికారులు పనిచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికార్‌ాబాద్ జిల్లా కొడంగల్‌లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో తన ఓటు హక్కును వినియోగించారు.
ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజాభిప్రాయం ఏ పార్టీ వైపు ఉందో ఈ ఫలితాలు స్పష్టం చేయనున్నాయి. తుది ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: