Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి ధర, నాణ్యత అంశంపై రాజకీయ వివాదం చెలరేగింది. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు.
భూమన మాట్లాడుతూ, 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ యూనిట్ టీటీడీకి కేజీ నెయ్యిని రూ.278 నుంచి రూ.306 మధ్య సరఫరా చేసిందని గుర్తుచేశారు. ఆ సమయంలో రూ.300 లోపు నాణ్యమైన నెయ్యి ఎలా సాధ్యమైందని ఇప్పుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు, అప్పటి సరఫరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: ICC: ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ అదే యూనిట్ కేజీ నెయ్యిని రూ.658కి సరఫరా చేస్తోందని భూమన ఆరోపించారు. ధరల్లో భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో సీఎం వివరణ ఇవ్వాలని కోరారు. గతంలో 40 లక్షల కేజీలకు పైగా నెయ్యి సరఫరా జరిగినట్లు సీబీఐ ఛార్జ్షీట్లో ప్రస్తావన ఉందని, ఈ అంశంపై సమగ్ర వివరణ అవసరమని అన్నారు.
ఈ వివాదంపై అధికార పార్టీ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: