Crimes: పూర్వకాలం నుండి మన సాంప్రదాయంలో ఇంటి ముందు పేడ చల్లి ముగ్గు వేయడం ఆనవాయితీ. అయితే కాలక్రమేణా పశువుల పేడ లభ్యత తగ్గడంతో, మార్కెట్‌లో దొరికే రసాయనాలతో కూడిన ‘పేడ రంగు’ను మహిళలు ఎక్కువగా వాడుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే క్షణికావేశంలో ఈ రసాయన రంగును సేవించి ఆత్మహత్యలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.
Read Also: Fake IPS Officer: తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అరెస్ట్


తాగి మరణిస్తున్న మహిళలు
కేవలం రూ.6 లకే దొరుకుతున్న ఈ రసాయన ప్యాకెట్ల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఇటువంటి కారణాలతో సుమారు వందమంది మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ విషాదకరమైన పరిణామం సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కుటుంబ సమస్యలు, గొడవలు, భార్యాభర్తల మనస్పర్ధలతో ఇటీవలి కాలంలో మహిళలు వీటిని తాగి ఆత్మహత్య(suicide)కు పాల్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదికి సుమారు వందమంది వరకు పేడరంగు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: