हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Uttar Pradesh: పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!

Saritha
Uttar Pradesh: పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నౌజ్ జిల్లాలో బుధవారం తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌ (Mobile tower) ఎక్కాడు. చివరికి టవర్‌పై నుండి పడి మరణించాడు. ఆ ఎత్తైన కట్టడంపైకి ఎక్కి దాదాపు రెండు గంటలు అక్కడే ఉన్నాడు. టవర్ పై నుంచి ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలని, ఆమె పేరును పదే పదే అరిచాడు. లేదంటే చనిపోతానంటూ అల్టిమేటం జారీ చేశాడు. నన్ను ఆమెకు వివాహం చేయి, లేకుంటే నేను దూకి చనిపోతాను అంటూ హెచ్చరించాడు.

కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, అతన్ని కిందకు దిగమని వేడుకున్నారు. పోలీసు బృందాలు కూడా ఒప్పించేందుకు ప్రయత్నించాయి. కానీ అతను టవర్ పైనే నిలబడ్డాడు. ముందుగా వివాహం గురించి నిర్ణయం తీసుకోండి, ఆ తర్వాతే కిందకు వస్తానంటూ కూర్చొన్నాడు. చివరికి టవర్ పైనుంచి కిందపడటంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని సిహెచ్‌సికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Bihar: యువకుడి కిడ్నాప్.. ఆపై బలవంతంగా పెళ్లి

ఘటనపై పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం

మృతుడిని పురభోజ్ గ్రామానికి చెందిన సుమిత్ రాజ్‌పుత్ (18). రాజస్థాన్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతను 15 రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. (Uttar Pradesh) సుమిత్ బంధువుల అమ్మాయితో వన్‌సైడ్ ప్రేమలో ఉన్నాడు. దీంతో ఆమె కుటుంబం ఆ వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించలేదు. కేవలం మూడు రోజుల క్రితం వేరొకరిని వివాహం చేసుకుంది. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఇంట్లో అతని వితంతువు తల్లి, తమ్ముడు అతనిపై ఆధారపడి ఉన్నారు. అతని చెల్లికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతని తమ్ముడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు. దీంతో సుమిత్ కుటుంబానికి ఏకైక జీవనాధారం అయ్యాడు. సుమిత్ మృతితో ఆ కుటుంబం ఒంటరిగా మిగిలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870