हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Musical road: ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్!

Vanipushpa
Musical road: ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్!

ముంబై అంటేనే వేగం, ట్రాఫిక్.. కానీ ఇప్పుడు అదే ముంబై(Mumbai) రోడ్లు పాటలు పాడుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కోస్టల్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఇప్పుడు ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతోంది. ఇండియాలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ రోడ్డుపై మీరు నిర్ణీత వేగంతో కారు నడుపుతుంటే.. ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. మ్యూజికల్ రోడ్ అంటే ఏదో స్పీకర్లు పెట్టి పాటలు ప్లే చేయడం కాదు. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ అద్భుతం. రోడ్డు ఉపరితలంపై నిర్దిష్టమైన లోతు , దూరంలో చిన్న చిన్న గీతలు (Grooves) చెక్కుతారు. వీటినే ‘రంబుల్ స్ట్రిప్స్’ అని కూడా అంటారు. వాహనం ఈ గీతలపై నుంచి వెళ్తున్నప్పుడు టైర్లకు, రోడ్డుకు మధ్య ఏర్పడే ఘర్షణ (Friction) వల్ల ప్రకంపనలు పుడతాయి. ఆ కంపనాల ద్వారా సంగీతం వెలువడుతుంది. హంగేరీ దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముంబైలో దీనిని రూపొందించారు.

Read Also: CM Chandrababu: మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం

Musical road: ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్!
Musical road: ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్!

500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్డు

ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్లే కోస్టల్ రోడ్డులో సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజికల్ రోడ్డు ఏర్పాటు చేశారు. దీనిని ధర్మవీర్ స్వరాజ్యరక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ అని పిలుస్తారు. వర్లీ వైపు వెళ్లే టన్నెల్ దాటిన తర్వాత మొదటి లైన్‌లో ఈ మ్యూజికల్ స్ట్రిప్స్ ఉంటాయి. వాహనదారులు తమ కారును గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో నడిపినప్పుడు మాత్రమే ఆ ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. వేగం అంతకంటే తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా ట్యూన్ లయ తప్పుతుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సుమారు రూ. 6.21 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ప్రయాణికులకు బోర్ కొట్టకుండా, సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే డ్రైవర్లు నిర్ణీత వేగాన్ని పాటించేలా ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ప్రపంచవ్యాప్తంగా జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా , యూఏఈ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

అందరినీ మెప్పించిన దూరదర్శన్ న్యూస్ రీడర్ సరళా ఇక లేరు

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

రూ. 7,499 కే సరికొత్త లావా యువ స్టార్ 3 లాంచ్: అద్భుతమైన ఫీచర్లు ఇవే!

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు

రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన సీఎం రేవంత్

రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన సీఎం రేవంత్

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

విద్యార్థులకు 3వ తరగతి నుంచే AI విద్య

విద్యార్థులకు 3వ తరగతి నుంచే AI విద్య

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

📢 For Advertisement Booking: 98481 12870