భారత యువ బ్యాటర్ అభిషేక్ (Abhishek Sharma) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ప్రస్తుతం కోలుకుంటున్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అతడు ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాడని సమాచారం. అయితే రాబోయే నమీబియా మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

ఎంతో ఉత్సాహంగా ఉన్నాం
ఈ విషయంపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన తిలక్ వర్మ, “ఢిల్లీకి చేరుకున్నాక అభిషేక్‌ను పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతడు ఈరోజే డిశ్చార్జ్ అయ్యాడు, ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉంది కాబట్టి, అతడి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం” అని వివరించాడు.ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఆరోగ్యంపై కూడా తిలక్ స్పందించాడు. “బుమ్రా ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉంది.
జట్టు అతడి విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. బహుశా రేపటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నా” అని చెప్పాడు.పాకిస్థాన్‌తో మ్యాచ్ గురించి కూడా తిలక్ వర్మ మాట్లాడాడు. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. “పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇతర జట్ల ఆటతీరును గమనిస్తున్నాం. మేం ఇప్పటికే మ్యాచ్ జోన్‌లో ఉన్నాం, త్వరలోనే మా ప్రణాళికలు మొదలవుతాయి” అని తిలక్ వర్మ చెప్పాడు..
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: