కొందరు ప్రముఖుల రహస్య జీవితాలు, వ్యవహా రాలను బయటపెడ్తున్న ఎపిన్ ఫైళ్లు ఇప్పు డు ప్రపంచంలోనే కలకలం సృష్టిస్తున్నాయి. అందులో నిజానిజాల లోగుట్టు పెరుమాళ్లకెరుక. అయినా ఆ పైళ్లలోని సమాచార నేపథ్యంలో ప్రస్తుతం యూరప్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలలో ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి కూడా కొన్ని అవాకులు చెవాకులు ఉన్నాయన్నది ఆ ఫైళ్ల సమాచారంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు, ప్రముఖులు, వారి వందిమాగధులు వగైరా అన్ని శ్రేణులకు చెందిన వారి రహస్య వ్యవహారాలు బట్టబయలవుతున్నాయి. ఉన్నవీ, లేనివీ, కనుగొన్నవీ కూడా పలు ఊహాగానాలతో ప్రపంచ రాజకీయాలను గడగడలాడిస్తున్నాయి. ఉన్నతస్థాయి వ్యక్తు లపై ఈపైళ్ల ద్వారా బయటపడిన విషయాలు, తద్వారా చెలరేగిన ఆరోపణలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులోని సమాచార నేపథ్యంలో కొంతమంది రాజకీయ పార్టీల అధినేతలు మంత్రులు సైతం రాజీనామాలు చేయాల్సి వస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో వివిధదేశాల్లో రాజకీయాలు ఎంతో చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆరో పణలు రాగానే కొన్ని దేశాల్లో ఆరోపణలెదుర్కొనవారు నిజానిజాలు వచ్చేలోపున అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కానీ రాజీనామా చేసి ప్రజాబాహుళ్యం నుంచి అదృశ్యమైపోవ డం, లేదా పదవి నుంచి వైదొలగాల్సి రావడం కూడా మామూలుగా జరిగేదే! యూరప్ దేశాల్లో ఎల్టీస్టీన్ ఫైళ్ల దుమారం ఎక్కువగా ఉంది. అమెరికాలో వీటి ప్రభావం ప్రస్తుతం తటస్థంగా ఉండగా, భారత్‌లో మాత్రం ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆయనకు అనుకూలంగా పనిచేశారని చెప్పబడుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్అంబానీ గురించి ఎక్కువ విషయాలు ఈ పైళ్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆఖ రికి చైనా దేశానికి సింహస్వప్నంగా ఉన్న టిబెట్ మత గురువు దలైలామా గురించి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్ స్టీన్ (Epstein)అనేవ్యక్తి లైంగిక నేరస్థుడు. అమెరికా ఫైనాన్షి యల్ ఏనాడో పట్టుబడి జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన పత్రాలు ప్రముఖలందరినీ వేధిస్తు న్నాయి. కానీ అతని సామాజ్యం చాలా విస్తృతమైందని, రాజకీయ ప్రముఖు లు వ్యక్తిగత ప్రవర్తనలోని లోపాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన పత్రాల్లోని అంశాల్లో అతి ప్రమాదకరమైన సమాచారం ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకుటుంబీకులు, బిలియనీర్లు, రాజకీయ మేధావులు దౌత్యవేత్తలు సైతం ‘ఏపీన్’ ఉచ్చులో పడ్డారని తెలియ వచ్చింది. ఎపిన్ను కలిసిన వారు, కలియని వారు, సోషల్ మీడియా ద్వారా వివిధ వాట్సాప్ సంకేతాల ద్వారా పరస్పరం చర్చించుకుంటూ ‘లింక్‌లో ఉన్నవా రందరి గురించిన విషయాలు ఈఫైళ్ల ద్వారా బట్టబయ లయ్యాయి. బ్రిటన్‌లో ప్రధానమంత్రి పదవికి ప్రధానంగా ఇబ్బం దులేర్పడ్డాయి. ఆమెరికాలో బ్రిటన్మాజీ రాయబారి మాండెల్సన్కు అతనితో లింకులు న్నట్లు బయట పడగానే బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్ట్ర్ సమస్యల్లోపడ్డారు. 2024లో బ్రిటన్ అత్యున్నత దౌత్య పదవిలో మాండెల్సన్‌ను నియ మించారు. కాగా మాండె ల్సన్కు ఎపిస్టీన్‌కు స్నేహపూర్వక లింకులున్నాయని బహిర్గతం కావడంతో గత సెప్టెంబరులోనే ఆయనను బ్రిటన్ ప్రధానికీ స్టార్టర్ తొలగించారు. అలాంటి వ్యక్తిని కీరా స్మార్టర్ నమ్మడమంటే పద్దతిగాలేదనే ఆరోపణలను బ్రిటన్ ప్రధాని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలక సమాచారాన్ని మాండెల్సన్ ఎపిస్టీన్ కు అందించారన్న ఆరోపణలు
తలకెత్తుకున్నారు. తీవ్ర ఆరోపణలున్నా ఈ అంశంలో తనను తప్పుపట్టేదేమీ లేదన్న ప్రధాని పదవికి రాజీ నామా ఆలోచన ఏదీ లేదని కీరా స్మార్టర్ స్పష్ం చేశారు. అలాంటి నియామకం తన చేతుల మీదుగా జరుగకుండా ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని చెబుతూ ఆయనే స్వయంగా విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలోనే స్మార్టర్ చీఫ్ ఆఫ్ స్టాప్ మోర్గాన్ మేక్ స్వీనే రాజీనామా చేశారు. మెండల్సన్ గురించి తానే సిఫార్సు చేసినందున నైతిక బాధ్యతగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక మరోప్రముఖుడు బ్రిటన్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉన్నవారేనని తేలింది. బ్రిటన్ వాణిజ్య ప్రతినిధిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రహస్య నిర్ణయాలు, పెట్టుబడుల వ్యవహారాలను తన అధికారిక పర్యటనలకు సంబంధిం చిన అంతర్గత విషయాలను ఎపిన్కు ఈ మెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపారు. జోర్దాన్‌లో నార్వే రాయబారిగా ఉన్న మోకా జూల్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమెతోపాటు మరో దౌత్యవేత్తటెర్జే రోడ్రెన్స్ కు ఎక్స్‌ట్రాన్ నుంచి 10మిలియన్
డాలర్ల లబ్ది సమకూరిం ది. స్లోవేకియా జాతీయ భద్రతా సలహాదారు మకోస్లావ్ లజాక్ కూడా పదవిని త్యజించారు. ఏరకమైన పదవి లేకుండానే ఎపిస్టీన్ (Epstein)వంటి లైంగిక నేరస్థుడు ఇంతమంది జీవితాలతో ఎందుకు ఆడుకున్నాడు. అదే పనిగా ప్రముఖుల రహస్య విశేషాలను వెలికి తీసి వారితో సంబంధాలు నెరపి ఈమెయిల్స్ ద్వారా పరస్పర సమాచారాన్ని రాబట్టి వారి జీవితాలను భ్రష్టు పట్టించాడు. ఇలాంటి ఫైళ్లు ఎలాంటి ఉద్దేశంతో సేకరించినా ప్రముఖుల జీవిత విశే షాలు, వ్యవహారాలు బయటపడడంతోనే ఆయా దేశాల్లో రాజకీయ గందరగోళం చెలరేగుతోంది. పోలాండ్, లాట్వియా లిధువేనియా వంటి దేశాల తోనే కాకుండా ఇంకా రష్యా, ఇతర దేశాల నిఘా సంస్థల నుండి ఏవైనా రహస్య సమాచారంలో ఏవిషయాలు దాగి ఉంటాయన్న అంశాలపై ప్రపంచ నేతలలో గుబులు బయలుదేరింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: