లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, భారీ జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హైదరాబాద్ (HYD) ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మార్చి 1 నుండి నిరంతరాయంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. వాహనదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ఆర్టీఏ ఆఫీసు నుంచి దానిని పొందాలని కోరుతున్నారు.
Read Also: Mancherial: తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

పోలీసులు హెచ్చరికలు
కేవలం వాహనం రోడ్లపై నడిపేవారే కాకుండా.. లైసెన్స్ లేని వ్యక్తులకు తమ వాహనాలను ఇచ్చే యజమానులపై కూడా ఇక నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు (HYD) పోలీసులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. వాహనం నడిపే అర్హత లేని వారికి వాహనాలు ఇవ్వడం నేరమని చెబుతున్నారు. దీనివల్ల భారీ జరిమానాలతో పాటుగా ఇతర చట్టపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చలాన్ లను తప్పించుకోవడానికి కొంతమంది తమ వాహనం నంబర్ ప్లేట్ ను ట్యాంపర్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంకెలు మార్చడం, నంబరు ప్లేటుకు మాస్కులు తగిలించడం, రంగు పూయడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: