हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Tummala Nageswara Rao: తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష

Tejaswini Y
Tummala Nageswara Rao: తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష

హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే మాత్రమే కాదని, రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) విమర్శించారు. ‘వికసిత్ భారత్’ నినాదమిస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష. నిరక్ష్యాన్ని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు.

Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!

Tummala Nageswara Rao: Center's economic discrimination against Telangana
Tummala Nageswara Rao: Center’s economic discrimination against Telangana

దేశ ఆదాయానికి దక్షిణాది వెన్నెముక అని, 2018-19 నుంచి 2022-23 వరకు అయిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుండే పావుభాగానికి పైగా రూ. 22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగి ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 16.3 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇది ఆర్ధిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని మంత్రి వ్యాఖ్యానించారు. పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతుందని తెలిపారు.

రూపాయికి సగటున 30 పైసలు

దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ, ఇదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నారని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాకుండా, ఉత్తర, దక్షి ణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షి ంచడం, తక్కువ వసూళ్లు చేసే రాష్ట్రాలను ప్రోత్సహించడం కేంద్ర విధానంగా మారిందని ఆరోపించారు. కేంద్రం చెప్పుకునే వికసిత్ భారత్ విధానం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతి నిధ్యం వహించే బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పదేళ్లలో ఏనాడు ప్రశ్నించకపోగా, రాష్ట్రానికి అన్ని తెచ్చాం. ఇన్ని చేశాం, రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూరు స్తుందనట్లు మాట్లాడటం వారి పతనానికి నాంది అని మంత్రి తుమ్మల హెచ్చరించారు.

జాతీయ రహదారుల నిర్మాణాలను కూడా రాష్ట్రానికి విడుదల చేసే నిధుల ఖాతాలలో వేస్తున్న బీజేపీ నేతలు, వాటిని నిర్మించి మళ్లీ ప్రజల నుండే టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని మంత్రి తుమ్మల అన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో చేర్చాల్సిందిగా తెలంగాణ చేసిన ప్రతిపాదనలలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, ఇప్పటికైనా తెలంగాణను రాజకీయంగా శిక్షించే బడ్జెట్లు మానుకోని, ఫెడరలిజాన్ని గౌరవించి, న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

E paper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి

ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

📢 For Advertisement Booking: 98481 12870