తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన వార్త వచ్చింది. తెలంగాణ టెట్-2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు రిజల్ట్స్ విడుదల కావడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా 30వ తేదీ కీ రిలీజ్ చేశారు.
Read Also: TG: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

1.95 లక్షల మంది హాజరు
తెలంగాణలో టెట్ ఎగ్జామ్ కోసం 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,95,181 మంది ఎగ్జామ్ రాశారు. 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక 42,573 మంది గైర్హాజరయ్యారు. ఇన్ సర్వీస్ టీచర్లు 90.27 మంది హాజరయ్యారు.. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీన మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశముందనే వార్తలు వినిపించాయి.
కానీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తరుణంలో టెట్ ఫలితాలు ఆలస్యంగా విడుదల అవుతాయనే వార్తలు కనిపించాయి. మున్సిపల్ ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండటంతో.. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిశాక విడుదల అవుతాయని అభ్యర్థులు భావించారు. కానీ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు టెట్ ఫలితాలు రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థులు ఊరట చెందుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: