Himanta Biswa Sarma : అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు సీఎం హిమంత బిశ్వ శర్మపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 1200 బిఘాల భూమిని (దాదాపు 750 ఎకరాలు) అక్రమంగా ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు సీఎం వెల్లడించారు.
Read Also: Nellore Nawabpet Crime News: నెల్లూరు వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేతలు తనపై అసత్య ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో జితేంద్ర సింగ్, గౌరవ్ గోగోయ్, భూపేంద్ర సింగ్ బఘేల్‌ల నుంచి రూ.500 కోట్ల పరిహారం కోరుతూ న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మరోవైపు సీఎం హిమంత బిశ్వ శర్మపై విమర్శలు చేశారు. ఓ వర్గంపై సీఎం విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు గువాహటిలోని పోలీసులకు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు అస్సాం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: