हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

India: ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్

Vanipushpa
India: ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్

దాయాది దేశం పాకిస్తాన్, పొరుగుదేశం చైనా నుంచి మన దేశానికి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రు దేశాల నుంచి వచ్చే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే త్రివిధ దళాలను మరింతగా పటిష్టం చేసుకునే పరిస్థితి. ఇందులో భాగంగానే భారత్ మరో కీలక రక్షణ ఒప్పందానికి రెడీ అవుతోంది. భారత వైమానిక దళ బలాన్ని మరింత పెంచే లక్ష్యంలో భాగంగా దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రాఫేల్ (Raphael) యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన ముందుకు సాగుతున్నట్లు రక్షణ వర్గాల సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి మూడవ వారంలో న్యూఢిల్లీకి రానున్న నేపథ్యంలో.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఈ మెగా డీల్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

New UPI Rules 2026: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్..ఇక 10 సెకన్లలోనే పేమెంట్

India: ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్
India: ఫ్రాన్స్‌తో 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్

భారత్‌లోనే తయారు చేయాలన్న ప్రతిపాదన

ఈ ఒప్పందానికి తుది ఆమోదం లభిస్తే.. భారత ఆయుధ సమీకరణ చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్ డీల్‌గా ఇది నిలవనుంది. ప్రత్యేకంగా ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. దాదాపు 100 వరకు రాఫేల్ యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ విమానాల తయారీ జరగనుండగా.. అత్యాధునిక ఫైటర్ జెట్ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయనున్నారు. దీని ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. 88 సింగిల్-సీటర్ జెట్లు, 26 ట్విన్-సీటర్ జెట్లు: రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం..ఈ ప్రాజెక్టులో 88 సింగిల్-సీటర్ జెట్లు, 26 ట్విన్-సీటర్ జెట్లు ఉంటాయి. డసాల్ట్ ఏవియేషన్‌తో పాటు భారత ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో దేశీయంగా పెద్ద ఎత్తున తయారీ చేపట్టనున్నారు. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, భారత వైమానిక దళం వద్ద మొత్తం 150 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి. ఇప్పటికే సేవలో ఉన్న 36 రాఫెల్స్‌కు ఇవి అదనంగా చేరతాయి.

నౌకాదళ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు

గత నెలలోనే 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ బోర్డు ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ఈ డీల్ అమలైతే, 4.5-తరాలకు పైగా ఉన్న అత్యాధునిక బహుళ-పాత్ర యుద్ధ విమానాల అవసరాన్ని IAF తీర్చుకోగలుగుతుందని అంచనా. స్క్వాడ్రన్ బలాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర : అంతేకాకుండా, వైమానిక దళంలోని స్క్వాడ్రన్ బలాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం భారత వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్ల అనుమతితో పోలిస్తే కేవలం 30 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాఫెల్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లపై దృష్టి సారిస్తోంది. 36 Rafale యుద్ధ విమానాలు సేవలు: ఇప్పటికే భారత వైమానిక దళానికి 36 Rafale యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వీటిలో సీ (C) వేరియంట్‌కు చెందిన చివరి విమానాన్ని భారత్ 2024 డిసెంబరులో స్వీకరించింది. ఈ విమానాలు అంబాలాలోని నంబర్ 17 స్క్వాడ్రన్‌, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా ఎయిర్ బేస్‌లో ఉన్న నంబర్ 101 ‘ఫాల్కన్స్’ స్క్వాడ్రన్‌లో మోహరించబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870