మున్సిపల్ ఎన్నికలు(Telangana) జరుగనున్న ప్రాంతాల్లో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Telangana Municipal Elections 2026: భారీ పోలీసు బందోబస్తు

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్(Telangana) ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అదేవిధంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే వరకూ మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు షాపులు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అధికారులు ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: