हिन्दी | Epaper
దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు

OU Registrar: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకులకు గైడ్షిప్ కల్పించాలి

Tejaswini Y
OU Registrar: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకులకు గైడ్షిప్ కల్పించాలి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు గైడ్ షిప్ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఉస్మానియా విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్(OU Registrar) ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డికి అసోసియేషన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఈ బ్రిజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అటు పరిశోధనలో ఇటు బోధనా సేవల్లో అత్యంత ప్రముఖమైనదని, ప్రస్తుత పరిస్థితులలో ఓయూ పరిశోధనా రంగంలో మరింతగా వృద్ధిలోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్హత గల బోధన పరిశోధన అభిరుచి గల అధ్యాపకులకు గైడ్ షిప్ కల్పించాలన్నారు.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

OU Registrar: Guidance should be provided to faculty members of government degree colleges
OU Registrar: Guidance should be provided to faculty members of government degree colleges

అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సైతం ఉత్తమ, మేలైన పరిశోధన వ్యాసాలను ప్రచురిస్తూ అంతర్జాతీయ ప్రామాణిక జర్నల్స్ లో వివిధ వ్యాసాలను ప్రచురింపజేస్తూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ తమ పరిశోధన అభిరుచిని చాటుతున్నారన్నారు. గైడ్ షిప్ సదుపాయం కల్పించినట్లయితే గ్రామీణ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ, మేలైన పరిశోధనలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యూనివర్సిటీలకు ప్రమాణాలకు అనుగుణంగా అర్హత గల అధ్యాపకులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని శాతవాహన, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాయన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో ఉన్నత విద్యా ప్రమాణాలు, అర్హత గల అధ్యాపకులకు పిహెచ్ డి గైడ్ షిప్ కల్పించి ఉత్తమమైన మేలైన పరిశోధనలకు బాటలు వేశాయన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, కమిషనర్ కళాశాల విద్య ఏ దేవసేన, అటు విశ్వవిద్యాలయాలకు ఇటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ప్రయోజనం చేకూరేలా పరిశోధన రంగాన్ని మరింత వృద్ధిపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్, మహిళా కార్యదర్శి డాక్టర్ భవాని, ఉస్మానియా విశ్వవిద్యాలయ కార్యదర్శి డాక్టర్ సిహెచ్ రాకేష్ భవాని, డాక్టర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870