పరిశ్రమలకు తగ్గట్లుగా సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ
చెన్నై సంస్థకు అనుబంధంగా వ్యవసాయ విస్తరణ కేంద్రం
మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దేందుకు *జాతీయ సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ మరియు పరిశోధన సంస్థలు (NITTTR)కు ‘డీమ్డ్ టు యూనివర్సిటీ’ హోదా కల్పించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. ఎన్ఐటిటిఆర్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఉన్న మొత్తం నాలుగు జాతీయ సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ మరియు పరిశోధన సంస్థల (NITTTR) ద్వారా గత ఐదేళ్లలో 4,45,074 మంది సాంకేతిక ఉపాధ్యాయులకు శిక్షణ అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఐదేళ్ల కాలంలో ₹776.57 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు.
Read also: Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

Four NITTT centers across the country
NITTTR సంస్థాగత బలోపేత చర్యల్లో భాగంగా అవసరాల ఆధారిత సాంకేతిక అధ్యాపక శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తక్కువ భాగస్వామ్యం ఉన్న రాష్ట్రాల్లో శిక్షణ లోపాలను గుర్తించేందుకు ప్రాంతీయ సహకారం, కోర్సుల సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల వినియోగం, అలాగే స్థానిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రంగాల వారీ శిక్షణ కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో NITTTR సేవలపై ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన NITTTR సంస్థలు భోపాల్, చండీగఢ్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటికి అనుబంధంగా విజయవాడ (ఆంధ్రప్రదేశ్) సహా పలు ప్రాంతాల్లో విస్తరణ కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
2016లో స్థాపించబడిన చెన్నై NITTTR సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయవాడ విస్తరణ కేంద్రం ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రాంగణం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల పరిధిని విస్తరించేందుకు జాతీయ విద్యా విధానం (NEP)–2020కు అనుగుణంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఇందులో స్వయం అభ్యాసానికి తోడ్పడే ఆన్‌లైన్ ఓపెన్ కోర్సులు SWAYAM వేదిక ద్వారా అందించడం, అలాగే ‘ప్రశిక్షణ్’ అనే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థలతో సహకారాన్ని పెంచుతూ అవసరాల ఆధారిత కార్యక్రమాలు, సామర్థ్య అభివృద్ధి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో శిక్షణ మాడ్యూళ్ల అభివృద్ధి కూడా జరుగుతోందని ఏలూరు ఎంపీకి ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: