हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

Road Development: మన్యంలో రహదారి సంక్షోభం – ప్రజల ఆవేదన

Pooja
Road Development: మన్యంలో రహదారి సంక్షోభం – ప్రజల ఆవేదన

అభివృద్ధిని వెక్కిరిస్తున్న మన్యం రోడ్లు

కోట్లు వెచ్చించినా కొల్లిక్కిరాని రహదారి సమస్య

అటవీశాఖ అభ్యంతరాలతో అర్ధాంతరంగా నిలిచిన రోడ్లు

చింతూరు : మన్యం పల్లెలో రహదారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏటా వందల కోట్లు వెచ్చించినా రహదారుల(Road Development) సమస్య పరిష్కారం కాకపోగా రహదారుల నిర్మాణం పేరుతో వెచ్చించిన సొమ్ములు నీళ్ళలా ఖర్చు అయి పోతున్నాయి తప్ప రహదారుల సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. అనేక చోట్ల రహదారులపై వేసిన మెటల్ లేచిపోయి కనీసం వాహనాలు నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. అనేక చోట్ల పనులు ఆర్దాంతంగా నిలిచిపోవటంతో వర్షాకాలంలో రోడ్లపై కాలువలు పారీ పెద్ద పెద్ద కాలువలు ఏర్పడ్డాయి. వాటి గురించి పట్టించుకునే వాళ్ళు మాత్రం లేరు. ఎందుకు ఈ సమస్య? దీనికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తె విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అయినా వాటిని ఉన్నత స్థాయిలో అధికారులు పెద్దగా పట్టించుకోరు.

Read Also: CMD Sivashankar: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు

Road Development

ఒక వేళ ఎవరైనా అధికారి పెద్దగా పట్టించుకున్నా రాజకీయ వత్తిళ్ళు రావటంతో మనకెందుకులే అనే ధోరణిలో కొందరు అధికారులు ఉంటె, మరి కొందరు ఆ సమస్య పరిష్కారం కాకుండానే మరో ప్రాంతానికి బదిలి కావటంతో ఆ తరువాత వచ్చిన అధికారులు దానిపై దృష్టి సారించక పోవటంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే తంతు కొనసాగుతుంది. ఇక అసలు విషయానికి వస్తె మన్యం గ్రామాల్లో లింక్ రోడ్ల సమస్య(Road Development) పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు నిధులు వెచ్చిస్తున్నాయి. వాటిలో మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం అధిక శాతం నిధులు కేటాయిస్తున్నా నేటికి సరైన రహదారి సౌకర్యం లేని గ్రామాలు కోకొల్లలు. ఎక్కడ ఏ రోడ్డు నిర్మాణం చేయాలన్న అటవిశాఖ అభ్యంతరాలతో రహదారుల అర్దాంతరంగా నిర్మాణం నిలిచిపోతుంది. ఉదాహరణకు చింతూరు ఐటిడిఎకు సుమారు 7కిలోమీటర్ల దూరంలో అనేక రహదారులు ఆటవిశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి.

దాదాపు 10సంవత్సరాలుగా ఈ రహదారులు నిర్మాణం అర్దాంతరంగా నిలిచిపోయి అక్కడి ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చింతూరు మండలం సర్వేల సమీపంలో జాతీయ రహదారి యన్.హెచ్.30 నుండి లచ్చిగూడెం, పేగ, అల్లిగూడెం, దొంగల జగ్గారం, తెలంగాణా సరిహద్దు వరకు దాదాపు 22 కిలోమీటర్ల రహదారి గత టిడిపి ప్రభుత్వ హాయంలో దాదాపు 8 సంవత్సరాల క్రితం రూ 8కోట్ల 40లక్షలతో మంజూరు అయ్యింది. ఈ రహదారి గతంలో కొని దశాబ్దాలుగా మెటల్ రోడ్డు ఉన్న రహదారి. ఈ రహదారిలో పెద్దగా ఎక్కడా దండ కారణ్యం లేదు. అయితె కొత్త చట్టాల ప్రకారం తారురోడ్ల నిర్మాణానికి అటవిశాఖ నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ రహదారి నిర్మాణా నికి టెండర్లు పిలవటంతో గుత్తేదారులు క్లబ్ల్యుబియం వరకు అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో పనులను చేపట్టి పూర్తి చేశారు. అనుమతులు లేని చోట్ల ఎపనులు మొదలు పెట్టలేదు.

నేటికి పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. దాదాపు 8 సంవత్సరాలుగా వేసి డబ్ల్యుబియం రోడ్లు ఆటోలు తిరిగి ప్రతి రోడ్డుపై మూడ చక్రాల గాళ్ళు పడ్డాయి. మెటల్ మొత్తం లేనిపోయి ద్విచక్రవాహనాలతో నరకప్రయాంగా మారింది. ఒక వేళ ఇప్పుడు అనుమతులు వచ్చినా అప్పటి యస్.యస్. ఆర్. రేట్లతో ఆ రహదారుల కొనసాగింపు అనేది గుత్తేదారులకు ఇబ్బందికరమే. దాంతో ఆ రహదారుల నిర్మాణం రద్దుచేయటం తప్ప మరో మార్గం లేదు. ఇదే కోవలో చింతూరు ఐటిడిఎ పరిధిలోని నాలుగు మండలాల్లో అనేక రహదారుల పరిస్థితి అదే. చింతూరు మండల కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింపేట అనే గ్రామము మీదుగా కుందులూరు, పెద్దమట్టలి వైపు ఉన్న రహదారి పరిస్థితి అదే. చింతూరు మండలం కన్సులూరు నుండి చదలవాడ, చౌలూరు, మిట్టవాడ మీదుగా లక్కవరం వరకు ఇదే పరిస్థితి. చింతూరు. మండలం ఏడుగురాళ్ళపల్లి నుండి పేగ వరకు గత 40సంవత్సరాల క్రితమే బిటి రోడ్డు ఉంది.

ఆ రోడ్డు మొత్తం పోవటంతో రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అటవిశాఖ అభ్యతరాలు పెట్టడంతో సగం రోడ్డు నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. మిగిలి రోడ్డు పనులు చేయటాన్ని ఆటవిశాఖ అడ్డుకోవటంతో రహదారి నిర్మాణం ఆగిపోయింది. దాంతో ఆ ప్రాంత ప్రజలు నిత్యం నరకం అనుభవించాల్సి పరిస్థితి.. ఇలా అనేక రోడ్లు మంజూరు కావటం. ఆటవిశాఖ. అభ్యంతరాలతో ముందు వెళ్ళక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే పరిస్థితి దాపురించి అక్కడి ప్రజలు సరైన సౌకర్యానికి నోచుకోక నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం లేదా డిప్యూడి సిఎం పవన్ కల్యాణ్ అయినా దృష్టి సారించి మన్యంలో రహదారుల నిర్మాణ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870