హైదరాబాద్ : ఆన్లైన్ గేమింగ్పై హైదరాబాద్ జీఎస్టి ఇంటెలిజెన్స్ అధికారుల దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ గేమింగ్ స్కాం దుబాయ్ కేంద్రంగా సాగిందని అధికారులు నిగ్గు తేల్చారు. ఈ గేమింగ్ స్కాంను(Online Gaming Scam) హైదరాబాద్ జీఎస్టి ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం నాడు రట్టు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ సహా ముంబయి, ఢిల్లీ నగరాలలో ఏక కాలంలో దాడులు చేసి భారీగా డాక్యుమెంట్లను, కంప్యూటర్లను జప్తు చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా భారీగా అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

ఈ గేమింగ్ వెనుక ముంబాయికి చెందిన విగోఫిన్ డిజిటల్ సోల్యూషన్స్ డైరక్టర్లు ప్రభుకుమార్, హైదరాబాద్ వాసి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా గుర్తించగా వీరు దుబాయ్ నుంచి ఈ దందాలు జరిపినట్లు నిర్ధారణ అయ్యింది. డొల్ల కంపెనీలకు ఐదు వేల కోట్ల రూపాయలను వీరిద్దరు మళ్లించినట్లు తేలింది. ఫిన్స్టిక్ ప్లాట్ ఫాంలు, రెంటెడ్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు తేల్చారు. జీఎస్టీ ఎగవేతకు గానూ ఓస్రో ఖాతాలను దుర్వినియోగం చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. పిన్టేక్ సంస్థలు, రేస్ ఈటీ 247 వంటి వెబ్సైట్ల ద్వారా అక్రమదందా సాగినట్లు తేలింది.
ఇందుకుగానూ బ్యాకింగ్ ఏపీఐలను అక్రమంగా ఉపయోగించి, ఆడిట్కు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్ల ద్వారా భారీ మొత్వాలు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ స్కాంలో కీలకంగా వున్న విగోఫిన్ డిజిటల్ సోల్యూషన్స్ డైరక్టర్లు వైఎస్ ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఇప్పటికే అరెస్టు చేయగా వీరిని విచారిస్తున్నారు. వీరి సహచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న జీఎస్టీ అధికారులు స్కాంకు సంబంధించిన మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గోల్మాల్లో మరింత మంది నిందితులు వుండే వీలుందని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: