हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ లకు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Telangana Elections: 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వాల్సిందే!

Tejaswini Y
Telangana Elections: 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వాల్సిందే!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో(Telangana Elections) ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చులకు ఎన్నికల సంఘం ఓ రేటును నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పాలనాధికారులు మున్సిపల్, పట్టణ పాలక కమిషనర్లకు వివరాలు పంపించారు. వీటిని అభ్యర్థులకు సరఫరా చేసి ధరల పట్టిక ప్రకారంగానే ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రచారంలో ఉపయోగించే 63 అంశాలతో ప్రతిదానికో ధరను నిర్ణయించారు. వాటి సైజు, విస్తీర్ణం ప్రకారంగా రేట్లను నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థి మున్సిపాలిటీలో రూ. లక్ష, కార్పొరేషన్లలో రూ.1.5 లక్షల్లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Read Also:DeputyCM Bhatti: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Telangana Elections: Details of expenses must be provided within 45 days!
Telangana Elections: Details of expenses must be provided within 45 days!

ధరల ప్రకారం అభ్యర్థులు

జిల్లా పాలనాధికారులు పేర్కొన్న ధరల ప్రకారం అభ్యర్థులు ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక బృందాలు వాడవాడలా తిరుగుతూ ప్రచారాలను వీడియోల్లో చిత్రీకరించి ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల ఖర్చు జాబితాలో చేరుస్తున్నారు. అభ్యర్థులు లెక్కలు తక్కువగా చూపించినా, ఎన్నికల అధికారులు తీయించిన వీడియోల ప్రకారం వ్యయం నిర్ధారించనున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లో పూర్తిస్థాయిలో ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేస్తారు. ఓడిన అభ్యర్థులు రానున్న మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లోనైనా పోటీకి అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870