Gurazala court verdict : కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్‌కు ఊరట దక్కలేదు. జంట హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే Pinnelli Ramakrishna Reddy తో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్ నిరాకరణ ఎదురైంది.
వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురజాల 10వ అదనపు జిల్లా న్యాయస్థానంలో వాదనలు ముగియగా, న్యాయమూర్తి జి.ప్రియదర్శిని పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పిన్నెల్లి బ్రదర్స్‌కు కోర్టులో ఊరట లభించలేదు.
Read Also: House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో గతేడాది మే 24న టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావుపై జరిగిన జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), వెంకట్రామిరెడ్డి (ఏ7), వెంకటరెడ్డి (ఏ8)గా నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో పిన్నెల్లి వెంకటరెడ్డి గతేడాది డిసెంబర్ 1న, రామకృష్ణారెడ్డి మరియు వెంకట్రామిరెడ్డి డిసెంబర్ 11న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వీరు జైలులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నారు. తాజాగా దాఖలైన బెయిల్ పిటిషన్ తిరస్కరణతో వారి జైలు జీవితం కొనసాగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: