
ఢిల్లీలోని(Delhi) వికాస్పురి ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్న యువకుడు అగ్నిప్రమాదంలో సజీవదహనమై మృతి చెందాడు. మృతుడిని సునీల్ (25)గా పోలీసులు గుర్తించారు.
Read Also: Karnataka Crime: రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
మస్కిటో కాయిల్ నుంచి మంటలు వ్యాపించాయన్న అనుమానం
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, సునీల్ రాత్రి సమయంలో బస్సులో(Delhi) మస్కిటో కాయిల్ వెలిగించి నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కాయిల్ నుంచి మంటలు చెలరేగి బస్సు లోపల వేగంగా వ్యాపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇతరులు లేనట్టు సమాచారం.
స్థానికులు మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే సునీల్ తీవ్రంగా కాలిన గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బస్సులోని ఎలక్ట్రికల్ వైరింగ్ లోపం లేదా ఇతర కారణాల వల్ల మంటలు వ్యాపించాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు సంఘటన స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి, బస్సు యజమాని మరియు ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: