కొండవీడు ఫెస్ట్-2026కు ఘనంగా శ్రీకారం
యడ్లపాడు (పల్నాడుజిల్లా) : (Kondaveedu Fest 2026) రెండురోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తన సహచర నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ప్రారంభించారు. తొలుత మొట్టమొదటిసారి కొండవీడు కోటకు విచ్చేసిన కందుల దుర్గేష్కు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీవో మధులత లుపుషగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం కేరళ సాంప్రదాయ నృత్యాలతో కొండవీడు కోటకు తోడ్కొని వెళ్ళారు. అనంతరం కొండపై గొలుసుకట్టు చెరువులలో ఏర్పాటు చేసిన బోటింగ్ వద్దకు వెళ్ళి స్వయంగా బోటు షికారు చేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.
Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

రూ.110 కోట్లతో కొండవీడు కోట అభివృద్ధికి నాంది
అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kondaveedu Fest 2026) మాట్లాడుతూ కొండవీడు చరిత్ర అందరూ తెలుసుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అనాటి పాలకులు ఎంతో ముందుచూపుతో ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు అద్భుతమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టూరిజంను పూర్తిగా అశ్రద్ధ చేసిందని విమర్శించారు. ఇప్పుడున్న మన ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో దాదాపు రూ.30 వేల కోట్లు పర్యాటకానికి కేటాయింపులు జరిగాయని తెలిపారు. కొండవీడు కోటకు రూ.110 కోట్ల వ్యయంతో అభివృద్ధికి నాంది పలుకుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం బోటు షికారులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్లు కృత్తికా శుక్ల, హిమాన్షు శుక్ల పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కొండవీడు ఉత్సవాలు: మంత్రి దుర్గేష్
కొండవీటి కోట ఉత్సవాలకు కనివిని ఎరుగని ఏర్పాట్లు చేసిన స్థానిక శాసనసభ్యులు పుల్లారావు, జిల్లా యంత్రాంగం కృషి అభినంద నీయమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం కొండవీడు ఉత్సవాలు నిర్వహిస్తామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రత్తిపాటి నేతృత్వంలో కొండవీడు ఉత్సవాలు విజయవంతం అయ్యాయని, అలాగే రాబోయే మహాశివరాత్రినాడు జరగనున్న కోటప్పకొండపై జరగనున్న తిరునాళ్ళ కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్సవాలకు విచ్చేసిన మంత్రి దుర్గేష్కు, సహచర శాసనసభ్యులు అరవింద్ బాబుకు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా జ్ఞాపికలు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: