విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను మరో మెట్టు ఎక్కించారు. నేర విచారణను వేగవంతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎఐ14ఎపి పోలీస్ట్ పైలట్ ప్రాజె క్టును ప్రారంభించినట్లు ఏపీ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన సమాచార పత్రంలో వెల్లడి చేసింది.. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో భాగంగా చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో దీనిని అమలులోకి వస్తుంది.
Read also: Maha Lodda Waterfalls: ఆంధ్రా ఊటీగా మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి

AI-based police project: DGP Harish Gupta
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సంప్రదాయ పోలీసింగ్ విధానంలో విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రాజెక్టును ప్రారంభించిన డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అధునాతన ఎఐ టెక్నాలజీతో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, డిజిటల్ పోలీసింగ్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనున్నట్లు వివరించారు. ఎఐ14ఎపి పోలీస్ అనేది ఒక సమగ్రమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారమని, దీని ద్వారా విచారణ సమయం తగ్గడమే కాకుండా, దర్యాప్తు నాణ్యత పెరిగి శిక్షల రేటు మెరుగుపడుతుందని, పౌరుల సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్ 2025లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏఐ14 ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్ ఈ ప్రాజెక్టుకు పునాది వేసింది.
దేశవ్యాప్తంగా 200 మందికి పైగా ఆవిష్కర్తలు, టెక్ నిపుణులు వచ్చిన ఆలోచనల ఆధారంగానే అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి, నాలెడ్జ్ బదిలీ కోసం అమెరికాకు చెందిన జెనరేటివ్ 4సైట్ ఎఐ సీఈఓ సూర్య కొత్త ను నాలెడ్జ్ పార్ట్నర్ గా నియమించారు. టెక్నాలజీ భాగస్వామిగా “స్పారిటీ సంస్థతో పోలీసు శాఖ అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది. గెలుపొందిన బృందాల సహకారంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ తి టూల్స్ను వినియో గానికి సిద్ధం చేసారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 8 ప్రత్యేకమైన ఏఐ టూల్స్ను పోలీసింగ్ వ్యవస్థలో ఏకీకృతం చేశారు. వీటిలో ప్రతి ఒక్కటీ శాంతి భద్రతల నిర్వహణ, పౌర సేవల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎఐ అన్ని ఎఐటూల్స్ ను ఒకే గొడుగు కిందకు తెచ్చే సాంకేతిక వేదికగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: