हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

AP Politics: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

Pooja
AP Politics: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

జనసేన పార్టీలో ఒక కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ(AP Politics) ఆవిర్భావం నుంచి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ తనకు అప్పగించిన అన్ని పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనను బాధ్యతల నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన పార్టీ అధినేతకు లేఖ రాశారు.

Read Also:AP: స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

AP Politics

పర్యావరణ అంశాలే నిర్ణయానికి కారణం

బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం నైతికత మరియు పర్యావరణ అంశాలే అని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య సమస్యలకు సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న ఒక పర్యావరణ కేసులో ఆయన పిటిషనర్‌గా ఉన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా, పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అదే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలో కీలక పదవిలో కొనసాగడం సరికాదనే భావనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అమరావతి రాజధాని పర్యావరణ అంశాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా బొలిశెట్టి నిర్ణయంపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రాజీనామా కాదు, నైతిక విరామం

ఈ పరిణామంపై స్పందించిన బొలిశెట్టి సత్యనారాయణ,(AP Politics) ఇది పార్టీకి రాజీనామా కాదని స్పష్టం చేశారు. తాను కేవలం పార్టీ పదవుల నుంచి నైతిక విరామం తీసుకుంటున్నానని చెప్పారు. పర్యావరణ న్యాయం కోసం సాగుతున్న పోరాటం రాజకీయ కారణాలతో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలు పరిష్కారమయ్యాక, పార్టీ కోరుకుంటే మళ్లీ బాధ్యతలు చేపడతానని, జనసేన సిద్ధాంతాలు, విలువలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జనసేనలో దీర్ఘకాలంగా కీలక పాత్ర పోషించిన బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ పదవుల నుంచి తప్పుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870