(TG) పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రేపు (మంగళవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గాల వారీగా పరిస్థితులు, మంత్రుల పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. (TG) అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా తీసుకెళ్లాలన్నదానిపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: