అండర్-19 వరల్డ్ కప్ (Under-19 World Cup) లో నేడు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ జరగనుంది. ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ ఈ రోజు కీలక పోరులో తలపడనున్నారు. ‘సూపర్ సిక్స్’ దశలోని గ్రూప్-2లో జరుగుతున్న ఈ మ్యాచ్ సెమీఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయించేంత కీలకంగా మారింది. అందుకే ఈ మ్యాచ్‌పై అభిమానులలోనే కాదు, క్రికెట్ విశ్లేషకులలో కూడా భారీ ఉత్కంఠ నెలకొంది.
Read Also: India vs New Zealand Final T20: భారత్ ఘన విజయం

నేటి మ్యాచ్‌లో కూడా అదే జోరు
ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని టీమిండియా విజయం సాధించింది. నేటి మ్యాచ్ (Under-19 World Cup) లో కూడా అదే జోరు కొనసాగించి, ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: