స్పటిక మాలను ధరించడం వల్ల మనస్సుకు శాంతి, ఏకాగ్రతలో స్థిరత్వం ఏర్పడుతుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఈ మాల(Mental Peace) శుక్ర గ్రహ ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది, ఫలితంగా ఆకర్షణ, పేరు ప్రతిష్టలు, సౌఖ్యాలు పెరుగుతాయని భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తగ్గి సంపద వృద్ధి చెందుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. స్పటికం శరీరంలోని అధిక వేడిని తగ్గించి మనస్సును చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

సానుకూల శక్తికి దోహదం
స్పటిక మాలను నియమ నిష్ఠలతో, శ్రద్ధగా ధరిస్తే(Mental Peace) సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. ఆలోచనలపై నియంత్రణ పెరిగి, ఆత్మవిశ్వాసం మెరుగవుతుందని విశ్వాసం. ముఖ్యంగా ధ్యానం, ప్రార్థన సమయంలో ఇది మనస్సు ఏకాగ్రతకు సహకరిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: