Nalgonda (నాంపల్లి): వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రియుడి కోసం ఏకంగా అతని భార్యనే అంతమొందించిన దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి (Nampally Murder) మండలంలోని కేతేపల్లిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఒక మహిళ, మరో మహిళపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేతేపల్లికి చెందిన నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో నగేష్ భార్యకు, సుజాతకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి నగేష్ భార్య అడ్డుపడుతోందని సుజాత కక్ష పెంచుకుంది.
పెట్రోల్ పోసి దారుణ హత్య
శనివారం ఈ వివాదం ముదిరింది. ఆవేశానికి లోనైన సుజాత, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను నగేష్ భార్యపై పోసి నిప్పంటించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బాధితురాలు తప్పించుకునే అవకాశం లేక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలు సుజాత చేసిన ఈ ఘాతుకాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు సుజాతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగేష్ పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: