మనిషి శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు తప్పుదారి పట్టడం వల్లే అలోప్సియా అరెటా వ్యాధి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAIST)కి చెందిన పరిశోధక బృందం(Hair Care) ఈ అంశంపై లోతైన అధ్యయనం నిర్వహించింది. వారి పరిశోధన ప్రకారం, అలోప్సియా అరెటా ఉన్నవారిలో ఇమ్యూనిటీ సెల్స్ జుట్టు కుదుళ్లను శత్రువుల్లా భావించి దాడి చేస్తున్నాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలహీనమవుతూ, ఒక్కసారిగా లేదా మచ్చల రూపంలో జుట్టు ఊడిపోవడం జరుగుతోంది.

ఆటోఇమ్యూన్ వ్యాధిగా అలోప్సియా అరెటా
నిపుణుల అభిప్రాయం ప్రకారం అలోప్సియా అరెటా ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ వైరస్‌లు, బ్యాక్టీరియాలను మాత్రమే(Hair Care) లక్ష్యంగా చేసుకోవాలి. కానీ ఈ వ్యాధిలో అదే వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేస్తుంది. ఇమ్యూనిటీ బలహీనత, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి కారణాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య వేగంగా పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు.
కొత్త చికిత్సలకు దారి తీసే అవకాశం
ఈ పరిశోధన ద్వారా ఇమ్యూనిటీని నియంత్రించే ఆధునిక చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జుట్టు కుదుళ్లపై ఇమ్యూనిటీ దాడిని అడ్డుకునే మందులు రూపొందితే, అలోప్సియా అరెటాను పూర్తిగా నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: