ఇటీవల కాలంలో కుక్కలపై పలు చర్చలు జరుగుతున్నాయి. వీధి కుక్క(Dog)ల భారీన పడి పిల్లలతో సహా పెద్దవారు మరణిస్తున్నారు. కుక్కకాటుకు గురై పిచ్చివారుగా అయిపోతున్నారు. సకాలంలో వైద్యం అందక, ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటుకు మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఈమధ్యకాలంలో కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వీధికుక్కల కాటు పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ, వాటిని అత్యవసరంగా అదుపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాక కుక్కలకు ఆహారం పెట్టేవారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఏ రాష్ట్రంలో కుక్కలు ప్రజలపై దాడి చేస్తే, రాష్ట్రప్రభుత్వాలే బాధితుల ఖర్చులను భరించాలని కూడా ఆదేశించింది. దీన్నిబట్టి కుక్కలు ఎంతటి ప్రమాదాన్ని, నష్టాన్ని తీసుకొస్తున్నాయో తెలుస్తుంది. వీధి కుక్కలే కాదు, ఇంట్లో పెంపుడు కుక్కల వల్ల కూడా ప్రజలకు భద్రత ఉండడం లేదు. తాజాగా ఓ పెంపుడు కుక్క మహిళపై దాడి చేసింది. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి..
Read Also: Tirumala Laddu Controversy : 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

బెంగళూరులో దారుణ ఘటన
బెంగళూరులో పెంపుడు కుక్క దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. యజమాని నిర్లక్ష్యం వల్ల కుక్క రోడ్డుపై నిలబడ్డ మహిళపై దాడికి దిగింది. దీంతో ఆమె ముఖం, మెడపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. అడ్డువచ్చిన
మరో ఇద్దరిపై కూడా కుక్క దాడి చేసింది.. గాయపడ్డ మహిళను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి
తరలించారు. కాగా ఆ మహిళ మెడకు 50కి పైగా కుట్టుపడ్డాయి అంటే ఆమెపై కుక్క ఎంత భయానకరంగా దాడి
చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు యజమానిపై కేసు నమోదు చేశారు. వీధి కుక్కల వల్లే కాదు పెంపుడు
కుక్కల పట్ల క ఊడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు
హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: