శుక్రవారం విశాఖలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న డి.సిఎం పవన్
విశాఖపట్నం : ‘కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంత వరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan) నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మం డలి నిబంధనలను తు.చ. తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహ కరించాలని సూచించారు.
Read Also: Nirmala Sitharaman: ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

నూతన సాంకేతికత సాయంతో వ్యర్థాల నిర్వ హణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. శుక్ర వారం సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో కాలుష్య నియం త్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామికవాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ప్రవన్ కల్యాణ్(Deputy CM Pawan) మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రా మికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగి స్తున్నాయి. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడి గ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఆ ప్రాంతంలో సర్వసాధారణం అయిపోయాయి. అలాగే విశాఖ పోర్టు కాలు ష్యం కూడా పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోంది. పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పోర్టు అథారిటీ పరిధిలోని గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. అక్కడ నివశించే ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారి సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి ఘటనలపై మానవతా దృక్పథంతో స్పందించి బాధిత ప్రజలకు అండగా నిలవాలి. పరిశ్రమలు నిబంధనలు పాటించవన్న భావన ఉందిరాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి.
అదే సమయంలో ఒక పరిశ్రమను స్థాపించాలి అంటే ఎన్నో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవహారంలో నిబంధనలు సరిగా పాటించవన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. అన్ని రకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతం చేశారని ఆ ప్రాంత ప్రజలు వాపోతూ ఉంటారు. పరిశ్రమలు వచ్చిన ప్రతిసారి ప్రజల్లో నిరక్ష్యానికి గురవుతున్నామన్న భావన కూడా పెరిగిపోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవాడల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చేయగలిగినంత చేయాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: