పాకిస్థాన్(pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran-Khan) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన కంటి సమస్య(Eye Blindness) తో బాధపడుతున్నారు. వెంటనే చికిత్స అందించకపోతే ఆయన కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పలు వార్తా కథనాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో రెటినల్ సిరలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఆయన కంటికి రక్త ప్రసరణ తగ్గి రెటీనా దెబ్బతినే ఛాన్స్ ఉంది.
Read Also: UNO: బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు
వెంటనే ఆపరేషన్ లేదా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించకుంటే ఇమ్రాన్ ఖాన్ శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ఛాన్స్ ఉంది. కానీ జైలు అధికారులు ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని అంటున్నారు. దీంతో పీటీఐ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఆపరేషన్ చేసే వసతులు లేవని.. వెంటనే ఆయన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2024 అక్టోబర్లో ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత వైద్యుడితో పరీక్షలు చేయించుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా వైద్యుడిని కూడా కలిసేందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని కానీ జైలు అధికారులు మాత్రం వైద్య టెస్టులకు పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నొరీన్ ఖానుమ్ అడియాలా జైలు బయట ఆందోళనలు చేశారు. ఆయనకు కంటి సమస్య ఉంటే తమకేందుకు చెప్పలేదని నిలదీశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను కలవడం కోసం తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ పీటీఐ నేతలు కూడా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై పీటీఐ ఛైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ కూడా స్పందించారు. ఒక ఖైదీని కలవడం చట్టపరమైన హక్కని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: