రికార్డుల దిశగా ఇ-సైకిళ్ల ర్యాలీ మరియు పెన్షన్ల పంపిణీ
Chandrababu Kuppam Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లె మండలం బెగిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు 5555 ఇ-సైకిళ్లను అందజేయడమే కాకుండా, బెగిలపల్లె నుండి శెట్టిపల్లె వరకు భారీ ర్యాలీలో పాల్గొంటారు. వేలాది సైకిళ్లతో సాగే ఈ ర్యాలీ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Read Also: Amaravati : మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

పారిశ్రామిక ప్రగతి: రూ. 675 కోట్ల ఒప్పందాలు
కుప్పం రూపురేఖలు మార్చే దిశగా సీఎం సమక్షంలో 7 ప్రముఖ కంపెనీలతో ఎంఓయూలు జరగనున్నాయి. సుమారు రూ. 675 కోట్ల పెట్టుబడులతో ప్లాస్టిక్, గార్మెంట్స్, చికెన్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు ఐఐటీ కాన్పూర్ నివేదిక ఆధారంగా నెట్ జీరో, వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ‘పీ4’ (P4) కార్యక్రమంలో భాగంగా ‘బంగారు కుటుంబాలు’ మరియు మార్గదర్శకులతో ముఖాముఖి నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: