
కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే మేడారం మహా జాతర నేటితో ఘనంగా ముగియనుంది. మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కాగా.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబా బాద్ జిల్లా గంగారం మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపై కి చేరారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెమీద ప్రతిష్టిం చారు.
Read Also: Hyderabad ATM robbery : కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ
రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర ప్రారంభం
శుక్రవారం సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) తో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శనభాగ్యం ఇచ్చారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరి దర్శనం కల్పించడంతో భక్తులు ఒక్కొక్కరుగా గూడారాలు ఖాళీచేసి ఇంటిదారి పట్టారు. శనివారం నలుగురు తిరిగి వనంలోకి చేరడంతో జాతర ముగుస్తుంది.జాతరకు నిన్నటి వరకు మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. మరో రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర తిరిగి జరగనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: