టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది మాజీ క్రికెటర్లు ఆయన ఆలోచనలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ విమర్శల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) కూడా చేరడం గమనార్హం. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని లారా అభిప్రాయపడ్డాడు.
Read Also: Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే
ఆలస్యం చేస్తే మరింత నష్టం జరుగుతుంది
అతడి నిర్ణయాలు సరికాదని, అవి భారత క్రికెట్ కు నష్టం చేస్తున్నాయని చెప్పాడు. హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెస్టు, వన్డే ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన పడిపోయిందని లారా (Brian Lara) విమర్శించాడు. టీ20 క్రికెట్ లో మాత్రమే ఇండియా బాగా ఆడుతోందని..టీ20ల్లో విజయాలు కూడా జట్టు సమష్టి కృషి కంటే వ్యక్తిగత ప్రతిభ వల్లే సాధ్యమవుతున్నాయని అన్నాడు.

ఇప్పుడు జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జట్టుగా విఫలమైతే..కీలకమైన మ్యాచ్ లలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని చెప్పాడు.టీ20 వరల్డ్ కప్ లో భారత్స్ అసలైన సమస్యలు బయటపడతాయని అన్నాడు. ఒకప్పుడు ఇండియాను ఓడించడానికి ప్రత్యర్థి జట్లు వంద రకాల వ్యూహాలతో వచ్చేవని… ఇప్పుడు ఏ జట్టు వచ్చినా వైట్ వాష్ చేస్తోందని లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ ను కాపాడాలంటే గంభీర్ ను తప్పించాలని.. ఆలస్యం చేస్తే మరింత నష్టం జరుగుతుందని అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: