థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా(Healthy Diet) విడుదలైనప్పుడే శరీరంలోని జీవక్రియలు సజావుగా కొనసాగుతాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే అలసట, బరువు మార్పులు, జీర్ణ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Castor Oil : ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్ నయమవుతాయా?

ఆహార మార్పులతో మెరుగైన నియంత్రణ
థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచేందుకు మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ వంటల్లో అయోడిన్ కలిగిన ఉప్పు వాడటం ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చిక్కుళ్లు, బటానీలు వంటి పప్పుధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
వాపు తగ్గించే ఆహారాలు
శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు విటమిన్ C అధికంగా ఉండే పండ్లు, చేపలు, ఓట్స్, రాగిజావ, మిల్లెట్స్ వంటి ఆహారాలను(Healthy Diet) డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. సరైన పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: