పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. థియేటర్లలో అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.ఇవాళ్టి నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు.
Read Also: Pawan Kalyan: విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
సారా అర్జున్ హీరోయిన్
ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహించడం విశేషం. విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు రాబట్టిన ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. విడుదలై రెండు నెలలు దాటినా కొన్ని థియేటర్లలో ఇంకా ప్రదర్శితమవుతుండటం ఈ సినిమాకు ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ చిత్రంతో సారా అర్జున్ బాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: