టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read Also: Rohit Sharma: హిట్‌మ్యాన్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ

ఎలాంటి స్పందన రాకపోవడం
కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన వారికి “ఈ పేజీ అందుబాటులో లేదు” లేదా “లింక్ బ్రోకెన్ అయి ఉండవచ్చు” అనే ఎర్రర్ మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. ఇటీవలే న్యూజిలాండ్‌పై అద్భుతమైన సెంచరీతో వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే, కోహ్లీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా మాత్రం యాక్టివ్గానే ఉంది. కోహ్లీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిమానులంతా ఆయన భార్య, నటి అనుష్క శర్మ సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి సారించారు. “కోహ్లీకి ఏమైంది?” అంటూ ఆమె తాజా పోస్టుల కింద వేలల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అనుష్క కూడా ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: