
విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబె (Shivam Dube) తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. జట్టులో మిగతా బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంలో విఫలమైనా సరే, దూబె 23 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్గా సోఫీ మోలినెక్స్ నియామకం
బౌలింగ్లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శివమ్ దూబే (Shivam Dube).. కఠిన పరిస్థితుల్లో ఆడటం వల్ల బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలిగానని తెలిపాడు.’ప్రస్తుతం నేను చాలా కష్టపడుతున్నాను. నా మానసిక స్థితితోనే నా ఆట మెరుగవుతోంది. కఠిన పరిస్థితుల్లో ఆడటం అలవాటవుతోంది. దాంతో బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలుగుతున్నాను.
వారు నాకు ఎలాంటి బంతులు సంధించబోతున్నారో ఊహించగలుగుతున్నాను.స్పిన్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం. ఇష్ సోధీ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను కొన్ని చెడ్డ బంతులేస్తాడని నాకు తెలుసు. వాటి కోసమే ఎదురు చూశాను. ఆ సమయంలో నేను డామినేట్ చేద్దామనుకున్నా’అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: