ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం మహా జాతర’లో ప్రధాన ఘట్టం వైభవంగా ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిలకలగుట్ట (వనం) నుంచి సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో జనారణ్యంలోకి ప్రవేశించింది. మేడారం అడవులన్నీ ‘జై సమ్మక్క.. జై జై సారలమ్మ’ అనే నామస్మరణతో మారుమోగిపోయాయి. పూజారులు సంప్రదాయబద్ధంగా అమ్మవారిని చిలకలగుట్టపై నుంచి కిందికి తీసుకువస్తుండగా, గిరిజన సంప్రదాయ వాయిద్యాల హోరు, భక్తుల శివసత్తుల పూనకాలతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ ఒక ఆధ్యాత్మిక లోకాన్ని తలపించాయి.
KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
అమ్మవారి ఆగమనానికి ప్రభుత్వం మరియు పోలీసులు అధికారిక లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో వస్తున్న సమ్మక్కను స్వీకరించే సమయంలో ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా స్వాగతం పలికారు. ఇది జాతరలో అత్యంత కీలకమైన మరియు ఉద్వేగభరితమైన ఘట్టం. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి, ఆ తల్లీ స్పర్శ తగిలిన కుంకుమ కోసం లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి రాత్రి 8:00 గంటల తర్వాత గద్దెలపైకి చేరుకుంది.. అప్పటికే గద్దెపై కొలువై ఉన్న సారలమ్మ పక్కన సమ్మక్కను ప్రతిష్టించడంతో జాతరలో అసలైన వేడుక ప్రారంభమవుతుంది. తల్లీకూతుళ్ల సమేత దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. గద్దెలపై అమ్మవార్లు కొలువుదీరిన తర్వాత భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. ముఖ్యంగా ‘బంగారం’ (బెల్లం) నైవేద్యంగా సమర్పించి, గడ్డె చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా తమ కష్టాలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాబోయే మూడు రోజుల పాటు ఈ జనప్రవాహం ఇలాగే కొనసాగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com